తూర్పులో ఎర్రబెల్లి దంపతుల ప్రచారం

వరంగల్​సిటీ/కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పు నియోజకవర్గంలోని 41వ డివిజన్‌‌‌‌‌‌‌‌, కొత్తవాడలో ఆదివారం బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు, భార్య రేణుకతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు మందా బాబు, 23వ డివిజన్‌‌‌‌‌‌‌‌ కొత్తవాడకు చెందిన పైడి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు, వారికి ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు, రేణుక దంపతులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అనంతరం ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను చూసే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేసి తూర్పు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీను, శివ, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, క్రాంతికుమార్, సాయి, రమేశ్‌‌‌‌‌‌‌‌, రాజు పాల్గొన్నారు.

ALSO READ : కండ్లద్దాలిచ్చినం.. కారు గుర్తుకు ఓటెయ్యండి : మంత్రి సబిత