రాజన్న సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో మరో ఫలితం వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్ఎస్ అభ్యర్థికి 1372 ఓట్లు వచ్చాయి. ఏడు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీ కౌంటింగ్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే అధికారులు బీజేపీ అభ్యర్థి గెలుపుపై అధికారిక ప్రకటన చేయడం లేదు. టీఆర్ఎస్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. దీనికి పోలీసులు, అధికారులు, మద్దతు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు కౌంటింగ్ కేంద్రం నుంచి అందరినీ బయటకు పంపిస్తున్నారు.