- ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు కట్టిస్తాం
- కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు : నియోజకవర్గంలో ఇండ్లు లేని ప్రతిఒక్కరికి సొంతిల్లు కట్టిస్తామని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో బీడి కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్యం, విద్య, రైతు సేవా కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలను మెనిఫెస్టోలో పొందుపరచామన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మహారాష్ట్రలోని అక్కల్కోట్నియోజకవర్గంలో కేంద్రప్రభుత్వ సాయంతో 40 వేల ఇండ్లు నిర్మించినట్లు గుర్తుచేశారు. ఇదే తరహాలో కామారెడ్డిలో కూడా నిర్మిస్తామన్నారు.అక్కల్కోట్ఎమ్మెల్యే సచిన్ కల్యాణ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.