ఎవరీ వెంకటరమణారెడ్డి.. సీఎంను.. కాబోయే సీఎంను ఓడించారు..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి సెగ్మెంట్.. పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేశారు. సీఎం కేసీఆర్, సీఎం రేసులో ఉన్న రేవంత్రెడ్డి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిచింది. ఇద్దరు పెద్ద లీడర్లు..ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని అనుకుం టున్న క్రమంలో.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుండగా.. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ లీడర్ వెంకటరమణారెడ్డిపై గెలుపుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   

కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి 5వేల 156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండో స్థానంలో సీఎం కేసీఆర్.. మూడో స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. వీవీఐపీ సెగ్మెంట్ గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డిలో ప్రధాన పార్టీల నేతలు పోటీ చేయడంతో ఈ స్థానం ఆసక్తి నెలకొంది. చివరి వరకు దోబూచులాడిన విజయం.. చివరికి వెంకటరమణారెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. 

కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 66వేల 652ఓట్లు సాధించి 6వేల741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కు 59వేల 911 ఓట్లు సాధించారు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి కి 54వేల 946 ఓట్లు వచ్చాయి. 
కామారెడ్డిలో ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగింది. తొలి రౌండ్ లో రేవంత్ రెడ్డి 1,981 ఆధిక్యంలో సాధించారు. 5వ రౌండ్ వరకు రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. కేసీఆర్ రెండోస్థానంలో నిలిచారు. 6,7 రౌండ్ లలో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా ఆధిక్యంలో వచ్చారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి వెంకటరమణారెడ్డి 1,970 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానానికి రేవంత్ రెడ్డి పడిపోయారు. చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడి.. చివరికి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. 

కాటిపల్లి వెంకటరమణారెడ్డి..ఎటువంటి హడావుడి లేకుండా బీజేపీ తరపును సింపిల్గా పోటీ చేశారు.. తాను ఎవరికి పోటీకాదు.. జస్ట్ పోటీ చేస్తున్నానంటే అని సింపుల్ చెప్పినవ్యక్తి..సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎంను సైతం వెనక్కి నెట్టి విజయం సాధించాడు. ఇద్దరు హేమాహేమీ నేతలను ఓడించి కామారెడ్డి నుంచి గెలుపు శంఖారావం మోగించాడు వెంకట్రామిరెడ్డి. ఇంతకీ ఎవరీ వెంకట్రామిరెడ్డి.. అతని బ్యాగ్ గ్రౌండ్ ఏమిటీ.. హేమాహేమీలను ఎలా ఓడించారు.    

గెలిచే వరకు వెంకటరమణారెడ్డి స్థానిక నేతగా మాత్రమే పరిచయం.. కామారెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత సీఎం కేసీఆర్, కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని వెనక్కి నెట్టి విజయం సాధించడంతో వీఐపీ అయిపోయాడు. ఎక్కడ చూసినా అతని గురించే చర్చ. అంచనాలకు తారుమారు చేస్తూ..అనూహ్యంగా ప్రత్యర్థులపై విజయం సాధించి సంచలనం సృష్టంచారు వెంకటరమణారెడ్డి. 

ఓ పక్క తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న వేళ.. వెంకటరమణారెడ్డి విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. 15వ రౌండ్ వరకు కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా లీడింగ్ లో ఉన్నారు.16 వ రౌండ్ తర్వాత లెక్కలు మారాయి.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లీడ్ లోకి వచ్చారు. అప్పటిను ముందంజలో కొనసాగారు.. విజయం సాధించారు. 

ఎవరీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ?

కె.వెంకట్రామిరెడ్డి గతంలో జెడ్పి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అతని ప్రొఫైల్ చాలా సింపుల్..12వ తరగతి వరకు చదువుకున్న వెంకట్రామిరెడ్డి.. ప్రజలకోసం ఆస్తులను త్యాగంచేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా బీజేపీ.. వెంకటరమణారెడ్డిని బరిలోకి దింపింది. కామారెడ్డిని కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ ఎస్ తరపున కేసీఆర్ లాంటి మహామహులు పోటీలో ఉన్నారు. 15 రౌండ్ల వరకు గెలుపు పై ఆశలు లేని వెంకటరమణారెడ్డి.. 16వ రౌండ్ నుంచి ఆధిక్యం సరళి మారింది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. అప్పటిను వెనక్కి చూడలేదు. అందరి అంచనాలను తోసిపుచ్చి.. సంచలన విజయం సాధించారు. 

వెంకటరమణారెడ్డి గెలుపు కారణమేంటీ.. 

ఇద్దరు విఐపీ నేతల మధ్య  స్థానిక నేతగా, బీజేపీ తరపున వెంకటరమణారెడ్డి బరిలోకి దిగారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. నవంబర్ 25 న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నవంబర్ 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్ ర్యాలీ, సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. నామినేషన్ నుంచి..ప్రచారం ముగిసే వరకు అటు కేంద్ర బీజేపీ నేతలు, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతల జోరుగా ప్రచారం చేశారు. 

రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే సాధించింది బీజేపీ పార్టీ. కామారెడ్డిలో తమ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గతంకంటే బీజేపీ రాష్ట్రంలో ఎక్కువ సీట్లను గెలుచుకుంది బీజేపీ పార్టీ. 2018 ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు గెలుచుకున్న బీజేపీ..ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు కైవసం చేసుకుంది.. అయితే ఈసారి బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 8 సీట్లు సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.