
- రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపేనని తేలింది
- టీచర్ల సమస్యల పరిష్కారమే నా ఎజెండా: మల్క కొమరయ్య
కరీంనగర్, వెలుగు: కరీంనగర్’ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ తీర్పు టీచర్లకు, ప్రధాని మోదీకి అంకితమని చెప్పారు. టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్యను కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్ద బండి సంజయ్ సోమవారం అభినందించారు. అనంతరం మల్క కొమరయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. కాగా, బీజేపీ కార్యకర్తల కృషి, తపస్సహకారం వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని మల్క కొమరయ్య తెలిపారు.