అరాచక పాలనకు విముక్తి కలిగిద్దాం : పైడి రాకేష్ రెడ్డి

నందిపేట, వెలుగు:  ఆర్మూర్​ నియోజకవర్గంలో పదేళ్లుగా కొసాగుతున్న అరాచక పాలనకు విముక్తి కల్పిద్దామని బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలం లోని తల్వేద, లక్కంపల్లి, చింరాజ్​పల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ  ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ప్రజలకు చేసింది గోరంతేనన్నారు. బీఆర్​ఎస్​ లీడర్లు బీజేపీ లీడర్లను బెదిరిస్తే ఊరుకునేది లేదని, లీడర్ కు, క్యాడర్​కు తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.  బీజేపీ అధికారంలోకి రాగానే లక్కంపల్లి సెజ్​లో పరిశ్రమలు అందుబాటులోకి తీసుకువచ్చి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

ఈ సందర్బంగా లక్కంపల్లి గ్రామస్తులు బీజేపీకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్​ఎస్ కు చెందిన  లక్కంపల్లి మాజీ ఎంపీటీసీ  సిరిపురం భాగ్య చిన్నయ్య దంపతులు, చింరాజ్​పల్లి గ్రామంలో బీఆర్ఎస్​కు చెందిన 100 మంది బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి,  పాలుపు రాజు, అబ్బి గంగారాం, వీరేశం, రమేశ్, రాజు, విఫుల్​రావ్​ పాల్గొన్నారు.

అవినీతి, అక్రమాలకు కేంద్రంగా ఆర్మూర్

ఆర్మూర్, వెలుగు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు ఆర్మూర్ నియోజకవర్గం కేంద్రంగా మారిందని బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​ రెడ్డి ఆరోపించారు.  మంగళవారం రాత్రి పట్టణంలోని11,12వ వార్డుల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఎమ్మెల్యే   అక్రమాలకు కళ్లెం వేయాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.  బీజేపీకి ఓటు వేసి తనను   గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో కంచెట్టి గంగాధర్, యమాద్రి భాస్కర్, ఫ్లోర్ లీడర్ నర్సింహారెడ్డి, మందుల బాలు, ద్యాగ ఉదయ్, పాలెపు రాజు తదితరులు పాల్గొన్నారు.