
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో సెకండ్ ప్రియారిటీ ఓట్లలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేశారు సిబ్బంది. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్యనే పోటీ చేస్తుంది. ఎలిమినేషన్ రౌండ్ తో వీళ్లిద్దరికీ సమానంగా ఓట్లు రావటంతో.. గెలుపు ఎవరిది అనే ఆసక్తి నెలకొంది.
ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు లక్షా 23 వేల 709 ఓట్లు, రాకేష్ రెడ్డికి లక్షా 4 వేల 846 ఓట్లు వచ్చాయి. దీంతో తీన్మార్ మల్లన్న 19 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కీలకంగా ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర్య అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ తర్వాత కూడా తీన్మార్ మల్లన్న 18 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో.. గెలుపు ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే గెలుపు ఎవరిది అనేది స్పష్టం కానుంది.