
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రెవాల్.. ఇక్కడితో తాను ప్రజా సేవ చేయడం ఆపబోనని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం కష్టపడతానన్నారు. మమతా బెనర్జీ గెలిచినప్పటికీ ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’’ తానేనని చెప్పారు. తాను సీఎం మమతకు గట్టి పట్టుకున్న నియోజకవర్గంలో పోటీ చేసి ఎదురునిలిచానని, దాదాపు 25 వేలకు పైగా ఓట్లు సాధించానని అన్నారు.
I am 'Man of the Match' of this game because I contested the election in Mamata Banerjee's stronghold and got more than 25,000 votes. I will continue doing the hard work: Bhabanipur BJP candidate Priyanka Tibrewal pic.twitter.com/pAiQMutcHi
— ANI (@ANI) October 3, 2021
దేశమంతటా ఆసక్తి కలిగించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలో ఉండడంతో.. దేశ ప్రజలందరి చూపు ఇటువైపే నిలిచింది. అయితే ఉత్కంఠకు తెరదించుతూ దీదీ భారీ మెజారిటీతో గెలిచారు. భవానీ పూర్ నియోజకవర్గంలో మమతా తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ పై 58వేల 832 ఓట్ల మెజారిటీ సాధించారు. గత గురువారం నాడు భవానీపూర్ లో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ లో 53.32శాతం ఓటింగ్ నమోదైంది.