పదేండ్లలో జీవన్ రెడ్డి చేసింది శూన్యమే : రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: పదేండ్లలో ఆర్మూర్ లో జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమేనని, అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు కుక్కర్లు పంచుతున్నారని బీజేపీ అభ్యర్థి రాకేశ్​రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆలూర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ.. పేరుకు మాత్రమే ఆలూర్​ను మండలాన్ని చేశారని, ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, విజయ్ భారతి పాల్గొన్నారు.