నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. డీఎస్పీ కార్యాలయంలో ఆర్‌ఎస్పీపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆర్‌ఎస్పీ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ భరత్ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని భరత్ ప్రసాద్ ఫిర్యాదులో వెల్లడించారు. కాగా మే13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. నాగర్‌కర్నూల్ లో బీఆర్ఎస్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో ఉన్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 17 పార్లమెంట్.. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ.