లోక్ సభ బీజేపీ అభ్యర్థులు వీరేనా..!

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో 8మంది బీజేపీ అభ్యర్థులు ఖరారైట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం కొనసాగుతుంది. తొలి విడత వివాదాలు లేని స్థానాలను భాజాపా ప్రకటించనుంది. కాసేపట్లో అధికారికంగా అభ్యర్థులను  ప్రకటించనున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణ, చేవెళ్లలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థులుగా పోటీలో దిగనున్నారు. 

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు పోతుగంటి భరత్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్,  నిజామాబాద్ నుంచి అర్వింద్, మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేంద్ర,  కరీంనగర్ నుంచి బండి సంజయ్ ల పేర్లు ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయి.