కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి

కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి

యాదాద్రి, వెలుగు: కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్, విడుదల చేస్తున్న ఫండ్స్​తోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు.  బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా భువనగిరిలోని సింగన్నగూడెం, ఎల్బీ నగర్, రాంనగర్, ఇంద్రానగర్, హనుమాన్ వాడ, సంజీవ్ నగర్, మాసుకుంట, రాయగిరి, అర్బన్ కాలనీల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దేశంలో రేషన్​ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా బియ్యం అందిస్తున్నారని తెలిపారు. 

 కేంద్రం అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న స్టేట్​ గవర్నమెంట్​, తామే ఇస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలందరూ కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్​ను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సుర్వీ శ్రీనివాస్, పంచెద్దుల బలరాం, పడమటి జగన్మోహన్ రెడ్డి, కోళ్ల భిక్షపతి, ఉమాశంకర్, నల్లమాస సుమ పాల్గొన్నారు.