ఢిల్లీలో బీజేపీ సంబరాలు షురూ.. సాయంత్రం ప్రధాని మోడీ హాజరు

ఢిల్లీలో బీజేపీ సంబరాలు షురూ.. సాయంత్రం ప్రధాని మోడీ హాజరు

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ సంబరాలు షురూ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన అధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో కమలం పార్టీ శ్రేణులు విజయోత్సవాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్దకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీజేపీ విజయం దాదాపు ఖరారు కావడంతో పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు స్టార్ట్ చేశారు. పార్టీ జెండాలతో కార్యకర్తల నృత్యాలు చేస్తుండటంతో బీజేపీ హెడ్ ఆఫీసు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. 

అలాగే.. బాణసంచా కాల్చిన కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని విజయోత్సవాన్ని గ్రాండ్‎గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కార్యకర్తలతో సందడితో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు శనివారం (ఫిబ్రవరి 8) రాత్రి బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ అధికారికంగా విజయోత్సవాలు నిర్వహించనుంది. 

ఈ విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితర కేంద్రమంత్రులు హాజరు కానున్నారు. ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు.