- పటాకులు కాల్చిన బీజేపీ
- స్వీట్లు పంచిన ఎన్సీపీ
- డ్యాన్సు చేసిన సీఎం షిండే
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించడంతో మహాయుతి కూటమి ఉత్సవాల్లో మునిగి తేలుతోంది. బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచి పటాకులు కాల్చి సంబరాలు చేశారు. బ్యాండు బాజాల మధ్య డ్యాన్సులు చేశారు.
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా సంబురాల్లో మునిగి తేలింది. మరో వైపు బారామతి నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం ఏక్ నాథ్ షిండే కౌంటింగ్ కేంద్రం బయట నృత్యం చేయడం విశేషం.