పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా:  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు  మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.   కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు.  భాషలు.. మన సంస్కృతి, వారసత్వం, మన జ్ఞాన సంపదకు నిలయాలన్నారు.  

ఇవాళ  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి.  మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి.  ఇప్పుడు  మోదీ ప్రభుత్వం వచ్చాకా  21 భాషలకు పెంచారు.    పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు.   

ALSO READ | కేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు ఇష్టంగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్​పెరిగింది. ఇందులో భాగంగానే   ప్రధాని మోదీ 2020లో ఎన్ఈపీ202 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు. మొదట్లో దీన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు సమర్థిస్తున్నారు.  ప్రతి భారతీయుడు తన మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషను ప్రోత్సహిస్తూ... ఇతర భాషలను గౌరవించాలని ’  కిషన్​రెడ్డి అన్నారు.