రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ లో ఒకరో ఇద్దరో చేరినంత మాత్రాన ఆ పార్టీకి సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని సంజయ్ ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమమే బీజేపీ ఎజెండా అని చెప్పిన సంజయ్.. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపనే బీజేపీ లక్ష్యమని అని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేని చెప్పిన సంజయ్ .. బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీనేని ధీమా వ్యక్తం చేశారు. 2023 జులై 8న జరిగే మోడీ సభను సక్సెస్ చేయాలని కోరారు.