బీజేపీ మ్యానిఫెస్టోలో ఫ్రీ.. ఫ్రీ.. : గర్జిణీలకు 21 వేలు, మహిళలకు నెలకు 2 వేల 500

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఫ్రీ.. ఫ్రీ.. అనే హామీలే వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలు పోటా పోటీగా వరాల జల్లులు కురిపిస్తున్నాయి. సంక్షేమానికి, ఉచిత పథకాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని బీజేపీ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. 

తాజాగా ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ‘సంకల్ప పాత్ర 1’ విడుదల చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లి మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు మొదటి క్యాబినెట్ లో ఆమోదం చేస్తామని ప్రకటించారు. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. హోలీ, దీపావళి పండుగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, ఆప్ లను మించిన హామీలను బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఇస్తోంది. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయలు, బస్తీల్లో అటల్ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం అందించనున్నట్లు నడ్డా ప్రకటించారు. 

ALSO READ | కాంగ్రెస్ హామీలు.. ఓటమికి టికెట్లు : బండి సంజయ్

ఈ సందర్భంగా నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో రాజకీయ నీతి సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చారని అన్నారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత మర్చిపోయేవారు. బీజేపీ సంకల్ప పాత్రతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుందని అన్నారు. 

బీజేపీ చెప్పింది చేస్తుంది, చెప్పనిది కూడా చేసి చూపిస్తుందని నడ్డా అన్నారు. మోడీ గ్యారంటీయే.. అమలయ్యే గ్యారంటీ అని అన్నారు. 2014 లో 500  హామిలిస్తే, 499 అమలు చేశామని, 2019 లో 235 హామీలిస్తే, 225 అమలు చేశామని.. మిగతా హామీలు ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపారు.