దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బీజేపీ మాత్రమే: నడ్డా

ప్రధాని మోదీ తెచ్చిన ఎన్నో పథకాలు  తెలంగాణలో అమలు కావడం లేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.  సింగిల్ బెడ్రూం గతి లేదు కానీ బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూం  అంటున్నారని  విమర్శించారు.   దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బీజేపీ మాత్రమే అని చెప్పారు.  ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి గుండె ధైర్యంతో చెప్పాలని సూచించారు.  సమాజంలో ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. 
తెలంగాణలో 2 కోట్లమందికి కేంద్రం రేషన్ ఇస్తుందన్నారు.

ALSO READ :  లిక్కర్ స్కామ్ పూర్తిగా అబద్ధం.. అంతా నిరాధారం : కేజ్రీవాల్ 

 కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కొనేది కేసీఆరే

కాంగ్రెస్ నుంచి ఒక్కరు గెలిచినా కొనేది కేసీఆరేనని ఆరోపించారు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..రాష్ట్ర ముఖ్య నేతలు  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి... ఓవైసీనీ ప్రసన్నం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  కుటుంబ వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెస్సేనని విమర్శించారు.   బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించాల్సిందేనన్నారు.  దేశంలో సకల సమస్యలకు కాంగ్రెస్సే కారణమని ధ్వజమెత్తారు. 

జై తెలంగాణ అంటే తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర  కాంగ్రెస్ దని విమర్శించారు కిషన్ రెడ్డి. సుష్మా స్వరాజ్ లేకుంటే అసలు  తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు .. బీజేపీలో  అందరం క్రమశిక్షణతో ముందుకెళ్తున్నామని..ఇదే జోష్ తో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.