నిధులు కేంద్ర ప్రభుత్వానివి... ప్రచారం రాష్ట్రప్రభుత్వానిది..

నిధులు కేంద్ర ప్రభుత్వానివి... ప్రచారం రాష్ట్రప్రభుత్వానిది..


ఏపీలో వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఏపీ బీజేపీ చీఫ్​ పురంధరేశ్వరి అన్నారు.  కేంద్ర ప్రభుత్వ నిధులతో  సంక్షేమ పథకాలు అములుచేస్తూ... రాష్ట్రం ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. పార్వతిపురం మన్యం జిల్లాలో ఆమె పర్యటిస్తూ... టిడ్కో ఇళ్లను పరిశీలించారు. జనసేన పొత్తు విషయంలో స్పందించిన ఆమె... పవన్​ కళ్యాణ్​ తో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు.  అయితే పొత్తు  విషయంలో కేంద్ర పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.

ఆంధ్రప్రదేశ్​ లో  బీజేపీనే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.