నస్పూర్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గని కార్మికుల ఇన్ కామ్ టాక్స్ ను రద్దు చేస్తామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని అర్కే న్యూటెక్ గనిపై జరిగిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను కాపాడాలంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని, గని కార్మికుల ఇన్ కామ్ టాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చూస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కట్టాల్సిన మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే నస్పూర్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయలతో కూడిన స్మార్ట్ సిటీగా మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర నాయకుడు పేరం రమేశ్, నేతలు బరుపాటి మారుతి, భీమయ్య, సత్రం రమేశ్, మిట్టపల్లి మొగిలి, గోపతి సందీప్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయం ప్రారంభం
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా సమీపంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని రఘునాథ్ వెరబెల్లి బుధవారం ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రవీందర్ రావు, బీజేపీ లీడర్లు బొప్పు కిషన్, హరి గోపాల్ రావు, హేమంత్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.