టార్గెట్ … సౌత్

టార్గెట్ … సౌత్

బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరును చెరిపేయడానికి పార్టీ హై కమాండ్ తాపత్రయపడుతోంది. సౌత్ లోనూ పాగా వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలుంటే ఒక్క సౌత్ లోనే 129 సీట్లున్నాయి. ఇప్పటివరకు దక్షిణాన ఒక్క కర్ణాటకలో మినహా మరే ఇతర రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. కిందటేడాది కర్ణా టక అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారానికి వచ్చినట్లే వచ్చి పరిస్థితి చేజార్చుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాపాయ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.

కిందటిసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ గాలి దేశమంతా బలంగా వీచింది. కాషాయ పార్టీకి కర్ణాటకలో బలం ఉండడంతో మిగతాదక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మోడీ మేజిక్ బాగాపనిచేసింది. మొత్తం 28 లోక్ సభ సెగ్మెంట్లలో బీజేపీ 17సెగ్మెంట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం తొమ్మిదిసీట్లతోనూ సరిపెట్టుకోవాల్సివచ్చింది. దేవెగౌడ నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ జేడీ (ఎస్) రెండు సీట్లకే పరిమితమైంది.

సౌత్ పై బీజేపీకి ప్రత్యేక ఆసక్తి ఎందుకు ?
సౌత్ పై బీజేపీ హై కమాండ్ ఈసారి ప్రత్యేక ఆసక్తిచూపడం ఓ ఎత్తుగడ అంటున్నారు రాజకీయపండితులు. 80 లోక్ సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ పై బీజేపీబోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, మెజారిటీ సీట్లు తమ ఖాతాలో పడతాయని మొదట్లో లెక్కలు వేసుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 78 సీట్లలో పోటీ చేసి 71 సీట్లనుగెలుచుకుంది. కాంగ్రెస్ కు కేవలం రెండు నియోజకవర్గాలే దక్కాయి. సమాజ్ వాది పార్టీ ఐదు సీట్లకే పరిమితమైంది. బీఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితేఈసారి జాతీయ రాజకీయాల పరిస్థితులు మారాయి.

యూపీలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు సమాజ్వాది పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఓకూటమిగా ఏర్పడడంతో బీజేపీ ఖంగుతిన్నట్లు లక్నోరాజకీయ వర్గాల సమాచారం. దీనికితోడు అజిత్ సింగ్నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ ) కూడా ఈ కూటమిలో చేరడం బీజేపీ కి మింగుడుపడలేదు.అజిత్ సింగ్ పార్టీకి పశ్చిమ యూపీలో పట్టుంది. అజిత్సింగ్ జాట్ వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ ఓట్లమీద కూడా పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితులు బీజేపీకిలేవు. కిందటిసారి లాగా మోడీ మేజిక్ లేకపోవడంతోగెలవడానికి బీజేపీ చెమటోడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో యూపీలో కలిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి సౌత్ పై బీజేపీ కన్నేసినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. సౌత్ లో ఒక్కో రాష్ట్రం లో ఒక్కో పరిస్థితి ఉంది.

బీజేపీకి అనుకూలమని గట్టిగా చెప్పుకోదగ్గ రాష్ట్రంఅంటూ ఒక్క కర్ణాటక మినహా ఏదీ లేదు. దీంతో కర్ణాటక నుంచి మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం మిగతా సీట్లపైపడుతుందన్నది బీజేపీ ఆలోచనలా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఒకవేళ నష్టం జరిగితే దానిని కర్ణాటకలో పూడ్చుకోవాలన్నది కాషాయ పార్టీ ఎత్తుగడగా చెబుతున్నారు రాజకీయ పండితులు. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి బరిలో దిగుతున్నట్లు ఢిల్లీపొలిటికల్ సర్కిల్స్ టాక్. ఈ లోక్ సభ సెగ్మెంట్ కేంద్రమంత్రి అనంతకుమార్ ది. 1996 నుంచి ఆయన ఈనియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు.

కొన్నినెలల కిందట అనంత్ కుమార్ చనిపోవడంతో ఆయనభార్య తేజస్విని ఇక్కడ నుంచి బరిలోకి దించాలని పార్టీ హై కమాండ్ భావించింది.అయితే తాజాగా బెంగళూరు సౌత్ సెగ్మెంట్ కు మోడీపేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్నుంచి మోడీ పోటీ చేయడం వ్యూహాత్మకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ సెగ్మెంట్లు ఉంటే కనీసం 22 సీట్లను మోడీ ప్రభావంవల్ల గెలుచుకోవచ్చన్నది బీజేపీ అంచనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు బీజేపీకి నార్త్ లోనేకాదు సౌత్ లో కూడా ఆమోదం ఉందని నిరూపించుకోవడానికే మోడీ ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలోఉన్నట్లు తెలుస్తోంది.

కన్నడ నేల పైనేతొలి బీజేపీ సర్కార్
సౌత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటకే. 2008లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. మొత్తం 224 సెగ్మెంట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లుగెలుచుకుంది. బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలో తొలి బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 80 సీట్లకే పరిమితమైంది.