బోధన్, వెలుగు: బోధన్‌లోని చెక్కిక్యాంప్ లో ఇంటింటికి బీజేపీ ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ముక్ముమ్మడిగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ చెక్కిక్యాంప్‌లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.
రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, అనేక మంది అర్హులకు పింఛన్లు అందడం లేదన్నారు.కార్యక్రమంలో బోధన్ పట్టణాధ్యక్షుడు కొలిపాక బాలరాజ్, ప్రధాన కార్యదర్శులు వాసు, సందీప్, ప్రవీణ్, శివరాజ్, బీసీ మోర్చా పట్టణా అధ్యక్షుడు గుంత గంగాధర్, ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.