రామగుండం బల్దియా ఇన్​కం పెంచాలి

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కొత్త బిల్డింగ్ ‌‌ల నిర్మాణం పెరిగిందని, వాటిని ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకువచ్చి బల్దియా ఇన్ కం పెంచాలని మేయర్ బి.అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ ఆఫీస్ ‌లోని  కౌన్సిల్ హాల్ లో మంగళవారం 13వ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్​మాట్లాడుతూ ఐడీఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ గదులకు వేలం పాట నిర్వహించి అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్  శివారు ప్రాంతం జనగామ చారిత్రక నేపథ్యం ఉందని, దానికి గుర్తింపు వచ్చేలా కార్పొరేషన్ పేరును 'జనగామ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్  'గా మార్చాలని కోరుతూ తీర్మానం చేయాలని డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు కవితా సరోజిని, శ్రీనివాస్, రమాదేవి ప్రతిపాదించారు.  

మేయర్ ను నిలదీసిన బీజేపీ కార్పొరేటర్  ‌‌

బల్దియా పరిధిలోని 40వ డివిజన్  ‌‌ ‌‌లో పనులు చేపట్టాలని బీజేపీ కార్పొరేటర్ లలిత మల్లేశ్‌‌ మేయర్ ‌‌ను నిలదీశారు. 40, 49వ డివిజన్ సరిహద్దులోని అశోక్ నగర్ మసీదు నుంచి మార్కండేయ కాలనీ వరకు రోడ్డు వేసేందుకు 6 నెలల కింద టెండర్​పిలిచి ఇంతవరకు పనులు చేపట్టలేదన్నారు. డివిజన్  ‌‌ ‌‌  ‌‌ ‌‌లో చాలా చోట్ల తాగునీటి పైపులైన్లు లీకవుతున్నాయన్నారు