డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్​ భిక్షాటన

కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 10, 11 వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాలని బీజేపీ కౌన్సిలర్​ దాసరి సునీత, బీజేపీ శ్రేణులతో కలిసి బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మద్దెలచెరువు నుంచి వరద నీరు స్థానిక వార్డుల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతకుముందు రైల్వే స్టేషన్​ సమీపంలోని కాంపౌండ్​ నుంచి బీజేపీ లీడర్లు, వార్డు ప్రజలతో కలిసి సునీత–రాజశేఖర్​ దంపతులు జోలపట్టి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. సమస్య పరిష్కరించాలని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నరేశ్‌, గణేశ్, అలేఖ్య, లీడర్లు రాజమురళి, తిరుమలవాసు, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.