నారాయణపేట, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి వచ్చిన ప్రభుత్వ నిధులను అదికారులు దుర్వినియోగం చేశారని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేటమున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ గందె అనసూయ అధ్యక్షత గురువారం నిర్వహించారు. గత ప్రభుత్వంలో పట్టణంలో ఇంటిగ్రెటెడ్ మార్కెట్, మటన్ మార్కెట్ వంటికి కోట్లలో ఖర్చుపెట్టి కట్తిస్తే నేడు అవి మూలన పడ్డాయని, ఆసమయంలో ఎన్ని నిధులు వస్తున్నాయో కనీసం అధికారులు చెప్పలేదని అన్నారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధి కోసం గత 5 ఏండ్లు కౌన్సిలర్లుగా కొనసాగినందుకు అభినందిస్తూ, ఎప్పుడైనా సరే అభివృద్ధి గురించి తనతో నేరుగా మాట్లాడవచ్చన్నారు. స్పెషల్ అధికారుల పాలనలో బాధ్యతతో పనిచేయాలని అన్నారు.
మాస్టర్ ప్లాన్‌పై త్వరలో సీడీఎంఏలో చర్చిస్తామని అన్నారు. అనంతరం చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ వార్ల విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్ సదాశివరెడ్డి, కమీషనర్ సునిత తదితరులు ఉన్నారు.