వా.. ఏమి ఎనర్జీ రా బాబు బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో వైరల్

భారతీయ జనాతా పార్టీ ఆదివారం 111 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తూ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఆ లిస్ట్ లో తనకు కావాల్సిన వారికి టికెట్ దక్కడంతో ఓ ఎమ్మెల్యే ఆనందానికి అవదులు లేదు. నిన్న రాత్రి టీవీ ముందే పాట పెట్టుకొని డ్యాన్స్ ఇరగదీశాడు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ బీజేపీ అభ్యర్థి నీరజ్ జింబా డార్జిలింగ్ లోక్ సభ నియోజకవర్గాన్ని తన ఫ్రెండ్ రాజు  బిస్టాకు కేటాయించడంతో ఫుల్ ఖష్ అయ్యాడు. డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. ఆ వీడియో ప్రస్తుతం  సోషల్  మీడియాలో ట్రెంటింగ్ లో ఉండి, వైరల్ అవుతోంది.

గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జింబా నీరజ్, గతంలో తన స్నేహితుడు రాజు బిస్టాకు టికెట్ ఇవ్వకుంటే తాను పార్టీ నుంచి వైదొలిగి స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేస్తాయని బీజేపీ అధిష్ఠానాన్ని బెదిరించాడు. అంతే కాదు 11 గుర్ఖా కమ్యూనీటిని తెగలను షెడ్యూల్డ్ తెగలు జాబితాలో కలపాలని తన రక్తంతో ప్రధానికి లేఖ రాశాడు.