జీడిమెట్ల, వెలుగు: కొంపల్లి మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్సర్కిల్పరిధిలోని ఫాక్స్సాగర్చెరువును కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు. మంగళవారం డిప్యూటీ కమిషనర్నర్సింహను కలిసి ఫిర్యాదు చేశారు.
ఫాక్స్సాగర్చెరువు ఎఫ్ టీఎల్, బఫర్జోన్పరిధిలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని డిమాండ్‌చేశారు. కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున షెడ్లు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే చింతల్, శ్రీనివాస్‌నగర్ నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. డీసీకి ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకులు ఆకుల సతీశ్, చందు, శ్యామ్కృష్ణారెడ్డి, అరుణ్‌రావు ఉన్నారు.