తిరుమల వివాదం : జగన్.. ఈ ఫారంపై సంతకం పెట్టి.. శ్రీవారిని దర్శించుకో : బీజేపీ

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం తిరుమల చుట్టూ తిరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.

జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు కూటమి నేతలు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునే ముందు.. వైకుంఠం దగ్గర డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ జగన్ ఇంతవరకు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఈ అంశంపై టీటీడీ ఈవోను కలవనున్నారు కూటమి నేతలు.

Also Read :- మళ్లీ వివాదంలో కంగనా రనౌత్

ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్దకున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ తిరుమల చేరుకుంటే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చే అవకాశమున్న క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.