హైదరాబాద్​లో స్లీపర్ సెల్స్​కు ఎంపీ మద్దతు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

 హైదరాబాద్​లో స్లీపర్ సెల్స్​కు ఎంపీ మద్దతు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  • వీసా గడువు తీరిన బంగ్లా, పాక్ పౌరులను రిటర్న్ పంపండి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్న అక్రమ వలసదారులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీయూలను వెంటనే తరిమివేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.  స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని ప్రభాకర్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లో ఉన్న పాక్, బంగ్లా దేశస్తులందరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏం సాధించారని బీఆర్ఎస్ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.