తెలంగాణ సాయుధ పోరాటాన్ని... బీజేపీ వక్రీకరిస్తుంది : సీపీఐ

తెలంగాణ  సాయుధ పోరాటాన్ని... బీజేపీ వక్రీకరిస్తుంది : సీపీఐ

తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ..వారం రోజులుగా ( సెప్టెంబర్​ 14 నాటికి)  సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. నిజాం రాచరిక పాలనకు, కరుడు గట్టిన భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన... మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ... వాస్తవ చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టాలనుకుంటున్న బీజేపీ ఆటలు సాగనీయమని... సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ   సభ్యుడు ఈటి నరసింహ అన్నారు. 

ALSO READ | మజ్లిస్‌‌కు తలొగ్గే విమోచన వేడుకలకు సీఎం రావట్లే:బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ప్రజలు తమ చేతికి దొరికిన కర్రలు, కట్టెలు, బరిసెలతో పోరాటం సాగించటం కష్టమని భావించిన... కమ్యూనిస్టు పార్టీ   సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ పిలుపునిందుకొని వేలాదిమంది ప్రజలు భూస్వాములపై తిరుగుబాటు చేసి... వాళ్ళ చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములను స్వాధీనం  చేసుకున్నారు. నిజాం సర్కార్...  ప్రజా పోరాటాల ముందు తలవంచని పరిస్థితి ఏర్పడిందని.. అప్పటికే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పటేల్ సైన్యం ఎలాగైనా తెలంగాణ ప్రాంతాన్ని కమ్యూనిస్టుల చేతుల్లోకి పోనివద్దని.. కుప్పకూలే దశలో ఉన్న నిజాంతోని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని అతనికి రాజ్ ప్రముఖ్ (గవర్నర్) పదవి ఇవ్వటమే కాకుండా ఆస్తులను, నష్టపరిహారాన్ని రాజభరణాలు, చెల్లించేలా ఆమోద పత్రాలు చేసుకున్నారన్నారు.

ALSO READ | మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది

 1956 వరకు గవర్నర్ గా   ఉన్న నిజాం... బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు  వల్ల హైదరాబాద్ సంస్థానానికి   విమోచన జరిగిందనీ ఎలా చెబుతారో... సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు భాష్యాలు చెబుతూ...  హిందూ ... ముస్లింలకు జరిగిన ఒక సంఘర్షణగా చిత్రీకరించే దుష్ప్రచారాన్ని... సిపిఐ పార్టీ ఎదుర్కొంటూ వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తున్నదని వివరించారు. 

ALSO READ | సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్​ సొంత అవసరాలకు వాడుకున్నారు

దేశ స్వాతంత్ర పోరాటానికి, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన భూస్వామ్య నిరంకుశ పాలనకు... ఏనాడు మద్దతు తెలపకుండా  పాలకవర్గాలకు వత్తాసు పలికిన ఆర్ఎస్ఎస్ శక్తులు ..  చరిత్రను కప్పిపుచ్చి  ప్రజలు చేసిన త్యాగాలను చెప్పకుండా చేసే  ప్రయత్నాలను ఎండగడతామని తెలిపారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వారి తప్పుడు విష ప్రచారం ను తిప్పి కొట్టాలని కోరారు. హైదరాబాద్ సంస్థానంలో సాగిన మహత్తరమైన ప్రజా పోరాట  చరిత్రను సామాజిక మాధ్యమాల ద్వారా యువతలోకి తీసుకెళ్తామని చెప్పారు