అంజిరెడ్డి గెలుపునకు సహకరించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి

అంజిరెడ్డి గెలుపునకు సహకరించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి

 సదాశివపేట, వెలుగు: నిరుద్యోగులకు అన్ని విధాల అండగా ఉండి, సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలో టీచర్లను కలిసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ దేశ ప్రజల  శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కార్​ అప్పులు కట్టడం తప్పా ప్రజలకు ఏమి చేయడంలేదన్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాణిక్ రావు, రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్​పాండే, సంగమేశ్వర్, చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు ఆదిత్య, శ్రీనివాస్, శ్రీకాంత్, శివలింగం, శ్రీశైలం, సుధాకర్, అంబదాస్ పాల్గొన్నారు.