బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు : ఆదివాసీలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్నకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు అంటూ హక్కు పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి సాగు కోసం పెట్టుబడులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఆదివాసీ రైతు ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు వ్యవసాయం చేస్తుంటే వారికి ఎనిమిది నుంచి పది గుంటల భూమికి మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారని తెలిపారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా చాంద గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.