రాజన్న వసతి గదుల ధరల పెంపుపై బీజేపీ ధర్నా

వేములవాడ, వెలుగు: ఆధ్మాత్మిక కేంద్రాలను దేవదాయ శాఖ అధికారులు వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. వేములవాడ రాజన్న భక్తుల వసతి గదులపై జీఎస్టీ విధించడానికి నిరసిస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఈవో ఆఫీస్​ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమైందన్నారు.  వసతి గదుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని వాటిపై జీఎస్టీ ఎలా విధిస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. అనంతరం ఈవోకు వినతి పత్రం అందించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, లీడర్లు శ్రీనివాస్, కృష్ణ, మల్లేశం యాదవ్​, పాల్గొన్నారు.