
గద్వాల టౌన్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్తగా అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి డికే స్నిగ్ద రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బంగ్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎనిమిది అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయన్నారు. మరో మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను నిజామాబాద్ సూర్యాపేట కొడంగల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.
80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్తగా అగ్రికల్చర్ కాలేజీని మంజూరు చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గద్వాల జిల్లాకు ఒక కాలేజీని మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రవికుమార్ ఎగ్బోటే, బండల వెంకట్రాములు, దేవదాసు, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.