
నిర్మల్, వెలుగు: ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. కార్యవాహ నిర్మల్ జిల్లా కన్వీనర్ అచ్యుత్ రావు అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశమంతా ఒకే విధానం అమలుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే అంశాన్ని కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే 2029 ఎన్నికలను ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడపల్లి గంగాధర్, చిన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, సతీశ్ రావు, శ్రీనివాస్, అశోక్, సాయినాథ్ తదితరులు
పాల్గొన్నారు.
వన్‌నేషన్- వన్ ఎలక్షన్ఎంతో మేలు
మంచిర్యాల, వెలుగు: వన్‌నేషన్- వన్ ఎలక్షన్ వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ మంచిర్యాల మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎలక్షన్‌అంశంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నిక వల్ల జరిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.