బీఆర్ఎస్, కాంగ్రెస్​వి కుమ్మక్కు రాజకీయాలు : వెరబెల్లి రఘునాథ్​రావు 

లక్సెట్టిపేట, వెలుగు : కాంగ్రెస్, బీఆర్ఎస్ ​రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ  పట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆరోపించారు. ఆదివారం లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో వెరబెల్లి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్​ఎస్​ ఫెయిలైందన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.

రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారన్నారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రం వచ్చాక బీఆర్​ఎస్​ మోసం చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను తరిమికొట్టాలన్నారు. దేశంలో,  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీ టౌన్​ ప్రెసిడెంట్​ వి.హరిగోపాల్ రావు, నాయకులు బియ్యల సతీశ్​ రావు, గుండా ప్రభాకర్, బుద్దే లక్ష్మణ్, వేముల మధు, ముష్కమ్ గంగన్న, మోటపల్కుల సతీశ్, గడికొప్పుల చంద్రమౌళి పాల్గొన్నారు. 

ఆర్​బీహెచ్​వీలో శ్రమదానం...  

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో భాగంగా రఘునాథ్​రావు ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలోని ఆర్​బీహెచ్​వీ స్కూల్​ ఆవరణలో శ్రమదానం చేశారు. నాయకులు వంగపల్లి వెంకటేశ్వరరావు, పెద్దపల్లి పురుషోత్తం, రజినీశ్ జైన్ , మున్నారాజ్​ సిసోడియా, పురుషోత్తం జాజు, తుల ఆంజనేయులు, రేకందర్ వాణి, ఆకుల అశోక్​ వర్ధన్, మాసు రజినీ,  జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేశ్​, బండి మల్లికార్జున్, రంగ శ్రీశైలం, బొడ్డు రఘునందన్, గాజుల ప్రభాకర్, రాజబాబు, అమిరిశెట్టి రాజు పాల్గొన్నారు.