సింగరేణిపై చర్చకు సిద్ధమా?

  •    ఎమ్మెల్యే బాల్క సుమన్​కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​సవాల్​

చెన్నూర్​, వెలుగు: చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్ ​సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని, ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు సవాల్​ విసిరారు.  మహాజన్​ సంపర్క్​ అభియాన్​లో భాగంగా గురువారం సాయంత్రం చెన్నూర్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం సింగరేణి  సంస్థను ప్రైవేటీకరిస్తుందని తప్పుడు బాల్క సుమన్​తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.  జోడువాగుల దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఫారెస్ట్​పర్మిషన్లు ఇవ్వడం లేదని సుమన్​అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు.  

సెంట్రల్​ఫారెస్ట్ పర్మిషన్లు వచ్చినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం ఫీజు చెల్లించకనే జాప్యం జరుగుతోందని తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో సుమన్ కు ఓటమి తప్పదన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​,  రాష్ట్ర కార్యదర్శులు పల్లె గంగారెడ్డి, ముల్కల్ల మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి రజినీష్ జైన్, పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.