మాక్లూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలపాలని బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోనే సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మాక్లూర్ లో నిర్వహించిన గావ్‌చలో అభియాన్ వర్క్‌షాప్‌లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అర్హులైన పేదలందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రామావత్ సురేశ్, లీడర్లు వినోద్, గంగారెడ్డి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్: గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని బీజేపీ లీడర్లు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ప్రోగ్రామ్ బోధన్ నియోజకవర్గ కన్వీనర్ స్వామి యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం బోధన్టౌన్లో బీజేపీ ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌లో గావ్‌చలో ప్రోగ్రామ్‌పై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. స్వామియాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వడ్డీ మోహన్‌రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, బోధన్, సాలూర మండలాధ్యక్షులు మనోహర్పటేల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ : ఆర్మూర్ మండలం పిప్రిలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ నిర్వహించారు. గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ మండలాధ్యక్షుడు రోహిత్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు హాజరై మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి, మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. మాజీ ఎంపీటీసీ కుస్తపురం ముత్తన్న, గెంట్యాల పండరి, హర్ష, వినోద్, రవి పాల్గొన్నారు.