
బెల్లంపల్లి రూరల్, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపడుతున్న ఆశా కార్యకర్తలకు శనివారం మంచిర్యాల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీశ్గౌడ్ మద్దతు తెలిపారు. గ్రామాల్లో అన్ని పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కీలకపాత్ర పోషిస్తున్న ఆశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు అరుంధతి, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు.