రెఫరెండం అన్నవ్ కదా రాజీనామా చెయ్.. సీఎం రేవంత్ కు డీకే అరుణ సవాల్

రెఫరెండం అన్నవ్ కదా రాజీనామా చెయ్.. సీఎం రేవంత్ కు డీకే అరుణ సవాల్
  • 11 సార్లు వచ్చినా  పాలమూరులో కాంగ్రెస్ గెలవలే
  • మోదీని తప్పుకోవాలని హక్కు లేదన్న డీకే


హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు తన పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని, నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ లో కాంగ్రెస్ కు 32 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు 21 వేలు వచ్చాయని అన్నారు. అర్బన్, రూరల్ అనే తేడా లేకుండా ప్రతి గ్రామానికి వెళ్లి మోదీ చేసిన అభివృద్ధిని వివరించామని చెప్పారు.  

మోదీ  ప్రధాని కావొద్దని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై డీకే అరుణ ఫైర్ అయ్యారు. 14 ఎంపీలు గెలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని అన్నారు.  మహబూబ్ నగర్ సిటీ ఒడితే నా గౌరవం పోతుందంటూ 11 సార్లు వచ్చి మీటింగ్స్ పెట్టారని చెప్పారు. ఇక్కడ గెలవక పోతే  తన సీటు పోతుందని కూడా చెప్పారని గుర్తు చేశారు.