కులమతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది

శాయంపేట, వెలుగు: బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ అక్రమవ్యాపారాలను కొనసాగించేందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు కత్తి వెంకటస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, ప్రధాన కార్యదర్శులు మారపెల్లి బుజ్జన్న, చిందం రవి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, కొమ్ముల భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.