
న్యూఢిల్లీ: మన దేశంలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ ఖాతాలో రూ.7,113.80 కోట్లు ఉన్నాయి. రూ.857 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ కు రాజకీయ పార్టీలు అందజేశాయి. 2023–24లో తమ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.1,685.69 కోట్లు, ఇతర డొనేషన్ల ద్వారా రూ.2,042.75 కోట్లు వచ్చినట్టు బీజేపీ పేర్కొంది. ఆ ఏడాది మొత్తం రూ.1,754 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.
అడ్వర్టయిజ్మెంట్లకు రూ.591 కోట్లు, విమానాలు/ హెలికాప్టర్లకు రూ.174 కోట్లు, మీటింగ్లకు రూ.84.32 కోట్లు, ర్యాలీలు, ఆందోళనలు, కాల్ సెంటర్ కోసం రూ.75.14 కోట్లు ఖర్చు చేసినట్టు, అభ్యర్థుల ఖర్చులకు రూ.191.06 కోట్లు ఇచ్చినట్టు వివరించింది.