
కర్ణాటక బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడను పార్టీని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నట్లు ఆరోపణలతో ఆరేళ్లపాటు బహిష్కరించారు. అనేక సార్లు హెచ్చరించినప్పటికీ పదే పదే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని బసనగౌడను సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
పార్టీ నుంచి సస్పెన్షన్ పై బసనగౌడ సోషల్ మీడియాలో స్పందించారు.పార్టీలో కొందరు స్వార్థ ప్రయోజనాలకోసమే తనపై వేటు పడిందన అన్నారు. బహిష్కరణతో అవినీతి, కుటుంబ రాజకీయాలు,ఉత్తరకర్ణాటక అభివృద్ది, హిందుత్వానికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేవని అన్నారు . రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానన్నారు బసనగౌడ.
బసనగౌడ వివాదాల చరిత్ర..
కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు బసనగౌడ. విజయేంద్ర అవినీతి పరుడు, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఫిబ్రవరి2025లో షోకాజ్ నోటీసు జారీ చేసింది. బసనగౌడకు ఇది మొదటి హెచ్చరిక కాదు.. గత డిసెంబర్ 2 న కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీజేపీ. ఇప్పటికీ నాలుగు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో బహిష్కరణ వేటు పడిందని కర్ణాటక బీజేపీ నేతలు చెబుతున్నారు.
ALSO READ | ప్రతిపక్షనాయకుడను.. వారం రోజులుగా నాకు మైక్ ఇవ్వలేదు..లోక్సభ స్పీకర్పై రాహుల్ తీవ్ర ఆరోపణలు
బసనగౌడ తొలగింపు కర్ణాటక రాజకీయాల్లో, ముఖ్యంగా విజయపురలో ప్రభావం చూపనుంది. విజయపురలో బసనగౌడకు మంచి పట్టు ఉంది. అయితే బసనగౌడ పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తాడా..లేక సొంత పార్టీ పెడతాడా అనేది దానిపై కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.