123 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

123 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

అమరావతి, వెలుగు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు 123 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది. విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుకు మళ్లీ అవకాశం కల్పించారు. మంగళగిరి నుంచి జగ్గారపు రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. కుప్పం నుంచి తులసీనాథ్ ఏపీ సీఎం చంద్రబాబుపై పోటీ చేయనున్నారు. పులివెందుల అభ్యర్థి పేరును ప్రకటించలేదు. రెండ్రోజుల క్రితం పార్టీలో చేరిన జయరాములుకు బద్వే ల్ టికెట్ ఇచ్చారు. కన్నా లక్ష్మీ నారాయణ, మాణిక్యాల రావు పేర్లు జాబితాలో లేకపోవడం గమనార్హం. వైఎస్ఆర్సీపీ పూర్తి జాబితాను ప్రకటించగా.. టీడీపీ 141 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.