- బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచనాన్ని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత పదేండ్లు బీఆర్ఎస్ సర్కార్.. ఎంఐఎంకు భయపడి వియోచన దినోత్సవం జరపకుండా జాతీయ సమైఖ్య దినంగా జరిపిందని అరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్ లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, రాష్ర్ట ఏర్పాటు తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అవకాశం కాంగ్రెస్ కు వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పడితేనే ఆత్మగౌరవం సాధ్యమని కేసీఆర్ సినిమా డైలాగులు కొట్టారని, అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకు భయపడ్డారని విమర్శించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్రానికి వివరిస్తున్నామని చెప్పారు.స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వివరాలు తెలుసుకుని అవసరమైన విధంగా రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారని వివరించారు ప్రభుత్వం అందించే నష్టం అంచనాల నివేదిక ఆధారంగా కేంద్రం సాయం చేస్తదన్నారు.