సభ్యత్వ నమోదుపై బీజేపీ ఫోకస్

  • స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కసరత్తు
  • సోషల్​మీడియా ద్వారా మెంబర్​షిప్

​నల్గొండ, వెలుగు : సంస్థాగతంగా పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీ  బీఆర్​ఎస్​ను  వెనక్కి నెట్టి రెండోప్లేస్ సాధించింది.  జిల్లాలో కేడర్​బలం లేకున్నా  భారీగా ఓట్లు సాధించగలిగింది.  పట్టణాలతో పాటు  గ్రామీణప్రాంతాల్లోనూ మోదీ హవా కనిపించింది. ఆ ఊపును కాపాడుకుంటూ  పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో  స్థానిక సంస్థలకు  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.

యువకులు, రైతులు, మహిళలపై ఫోకస్​  

ఈ సారి  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గతంలో సభ్యత్వనమోదు  మొక్కుబడి వ్యవహారంగా నిర్వహించడంవల్ల జిల్లాలో క్రియాశీలక సభ్యులు ఎంతమంది ఉన్నారన్న లెక్క కూడా పార్టీ వర్గాలు చెప్పలేకపోతున్నాయి.  పార్టీ కమిటీలు బలంగా లేకపోవడం వల్ల సభ్యత్వ నమోదు  తూతూమంత్రంగానే సాగింది. ఈసారి అందుకు భిన్నంగా ఊరూరా కార్యక్రమాన్ని నిర్వహించాలని  ప్లాన్​చేశారు. కొత్తగా  సోషల్ మీడియా ద్వారా కూడా సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పించారు.  88000 02024 నంబర్​కు మిస్​డ్​ కాల్​ఇచ్చినా..  మేసెజ్​ పంపినా  వారికి సభ్యత్వం కల్పించనున్నారు.

 సభ్యత్వనమోదులో పాల్గొనే వారికి, సభ్యత్వం పొందేవారికి ఉన్న సందేహాలు తీర్చేందుకు   హెల్ప్​లైన్​ నంబరు(88601 47147) ను కూడా  అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో  అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 50మందిని  సభ్యులుగా చేర్పించిన వారిని  క్రియాశీలక సభ్యులుగా గుర్తిస్తారు. ప్రతి బూత్ నుంచి కనీసం ఒక క్రియాశీలక సభ్యుడు ఉండేలా చూడనున్నారు. మోదీ విధానాలు, కేంద్ర  పథకాలను   ఇంటింటికి వెళ్లి వివరిస్తూ సభ్యత్వ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా  యువకులు, మేధావులు, బీసీ, ఎస్సీ వర్గాలు, మహిళలు, రైతులను సభ్యులుగా చేర్పించాలని కేడర్​కు చెప్తున్నారు.  

నల్గొండ పార్లమెంట్​ సెగ్మెంట్​లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో  కనీసం 2 లక్షల మందిని  సభ్యులుగా  చేర్పించాలని  టార్గెట్​ పెట్టుకున్నారు.  జిల్లా స్థాయిలో ఇప్పటికే సభ్యత్వ నమోదుపై  కార్యశాలను నిర్వహించారు. సెప్టెంబర్​1న ప్రధాని మోదీ  సభ్యత్వ నమోదును  అధికారికంగా ప్రారంభిస్తారు.    

పార్టీ  బలోపేతమవుతుంది 

సభ్యత్వ నమోదులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే  మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. క్యూఆర్ కోడ్​, నమో యాప్​,  వాట్సాప్​ ద్వారా స భ్యత్వ నమోదు చేసుకోవచ్చు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్​, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో సభ్యత్వం తీసుకుంటాం.  ఈనెల  31 న బూత్​స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

డాక్టర్​ నాగం వర్షిత్​ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు,  నల్గొండ