తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

తెలంగాణను మరో బెంగాల్‎గా మార్చొద్దని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు పోలీసులను చెప్పుచేతల్లో ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ అడిషనల్ డీజీపీ జితేందర్‎కు లేఖ అందజేశారు.

‘బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ లీడర్లపై దాడులు చేశారు. దాడులు చేసిన వారిని వదిలేసి.. అక్రమంగా బీజేపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. బోధన్‎లో శివాజీ విగ్రహం పెట్టె ప్రయత్నం చేస్తే.. బీజేపీ నేతలపై 307 మర్డర్ కేసులు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు దాడులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మహిళా న్యాయవాదిపై ఏకంగా కోర్టులోనే దాడికి దిగారు.. వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. తెలంగాణ రాష్టాన్ని బెంగాల్‎గా మార్చొద్దు. బీజేపీ నేతలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయంతో  ముందుకు వెళ్తాం. బీజేపీ నేతలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఈ దాడులను ఆపకుంటే భవిష్యత్‎లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం’ అని రాంచందర్ రావు హెచ్చరించారు.

For More News..

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు