టీచర్లు, గ్రాడ్యుయేట్ల తరఫున కొట్లాడింది బీజేపీనే : ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

టీచర్లు, గ్రాడ్యుయేట్ల తరఫున కొట్లాడింది బీజేపీనే : ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

కరీంనగర్, వెలుగు: అధికారంలో లేకపోయినా గ్రాడ్యుయేట్లు, టీచర్ల పక్షాన కొట్లాడింది బీజేపీయేనని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మార్నింగ్ వాకర్స్‌‌ను కలిసి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు, ఉద్యోగ, టీచర్ల నుంచి రెస్పాన్స్ బాగుందన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అవకాశమిస్తే  వాళ్లు ఏమి చేయలేదనే భావన వారిలో ఉందని, అందుకే వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, లీడర్లు పాల్గొన్నారు.