సర్వే సంస్థలు ఊహించని ఫలితాలు చూస్తాం: బండి సంజయ్

యాదాద్రి భువనగిరి:  పార్లమెంట్ ఎన్నికల్లో సర్వే సంస్థలు ఊహించని ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.  తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించబోతున్నామని చెప్పారు. ఈ మేరకు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నికల గెలుపులో దోహదం  చేస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. అప్పుడు బీఆర్ఎస్ తో పోరాడింది..  ఇప్పుడు కాంగ్రెస్ తో పోరాడేది బీజేపీనే అని ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు సంజయ్. ప్రధానిగా నరేంద్ర మోదీ.. లేని దేశాన్ని ప్రజలు ఊహించుకోలేకపోయారని.. అందుకే బీజేపీకి ఓటు వేశారన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటై బీజీపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.