కేంద్రం దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తోంది

కేంద్రం దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తోంది
  • దేశంలో ఉన్నది ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ ప్రభుత్వం
  • సీపీఎం జాతీయ కౌన్సిల్‌‌ సభ్యురాలు బృందాకారత్‌‌

ఆదిలాబాద్‌‌ టౌన్‌‌, వెలుగు : బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణలు చేస్తూ దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తోందని రాజ్యసభ మాజీ సభ్యురాలు, సీపీఎం జాతీయ కౌన్సిల్‌‌ సభ్యురాలు బృందాకారత్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆదిలాబాద్‌‌లో సీఐటీయూ జిల్లా ఆఫీస్‌‌ను ప్రారంభించారు. అనంతరం ఆర్‌‌అండ్‌‌బీ గెస్ట్‌‌హౌస్‌‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 

భారత రాజ్యాంగంపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్‌‌ను ప్రయోగిస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదని.. ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలతోనే కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్‌‌ను తొలగించి అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

Also Read : విభజన చట్టంలోని హామీల సాధనకు కృషి

కార్యక్రమంలో హైకోర్ట్‌‌ మాజీ న్యాయమూర్తి బి.చంద్రకుమార్, సీఐటీయూ ట్రెజరర్‌‌ ఎం.సాయిబాబు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, టీఏజీఎస్‌‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్‌‌ పాల్గొన్నారు.